తలగవు కొండలకైనను, మలగవు సింగములకైన మార్కొను కడిమిం
కలగవు పిడుగులకైనను, ఇలబలసంపన్నవృత్తి ఏనుగు గున్నల్.
Thalagavu koMdalakainanu
thalagavu koMdalakainanu, malagavu siMgamulakaina maarkonu kadimiM
kalagavu pidugulakainanu, ilabalasaMpannavtRththi Enugu gunnal.
|
|
కరిదిగుచు మకరి సరసికి, కరి దరికిని మకరి దిగుచు కరకరిబెరయన్
కరికి మకరి మకరికి కరి, భరమనుచును అతలకుతల భటులరుదుపడన్.
Karidhiguchu
karidhiguchu makari sarasiki, kari darikini makari dhiguchu karakariberayan
kariki makari makariki kari, bharamanuchunu athalakuthala bhatularudhupadan.
|
|
అలయక సొలయక వేసట, నొలయక కరి మకరితోడ ఉధ్ధండత
రాత్రులు సంధ్యలు దివసంబులు, సలిపెం పోరొక్కవేయి సంవత్సరముల్
Alayaka solayaka
alayaka solayaka vEsata, nolayaka kari makarithOda uDhDhaMdatha
raathrulu saMDhyalu dhivasaMbulu, salipeM pOrokkavEyi saMvathsaramul
|
|
ఏ రూపంబున దీనిగెల్తు ? ఇటమీదేవేల్పు చింతింతు?
ఎవ్వారిం జీరుదు ? ఎవ్వరడ్డమిక ? ఇవ్వారిప్రచరోత్తమున్
వారింపం తగువారలెవ్వరు ? అఖిల వ్యాపార పారాయణుల్
లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపం ప్రపుణ్యాత్మకుల్
E Roopambuna
E roopaMbuna dheenigelthu ? itameedhEvElpu chiMthiMthu?
evvaariM jeerudhu ? evvaraddamika ? ivvaaripracharOththamun
vaariMpaM thaguvaaralevvaru ? akhila vyaapaara paaraayaNul
lErE mrokkedha dhikkumaalina moraaliMpaM prapuNyaathmakul
|
|
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు
అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైనవాడెవ్వడు
వాని ఆత్మభవు నీశ్వరునే శరణంబువేడెదన్
Evvaniche Janinchu
evvanichE janiMchu jagamevvani lOpalanuMdu leenamai
evvani aMdhudiMdhu paramEshvarudevvadu moolakaaraNaMbevvadu
anaadhi maDhyalayudevvadu sarvamu thaanainavaadevvadu
vaani aathmabhavu eeshvarunE sharaNaMbuvEdedhan
|
|
లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు
పెంచీకటి కవ్వల నెవ్వం, డే కాకృతి వెలుగు నతని నే సేవింతున్
Lokambulu Lokeshulu
lOkaMbulu lOkEshulu lOkasThulu thegina thudhina lOkaMbagu
peMcheekati kavvala nevvaM, dE kaaktRthi velugu nathani nE sEviMthun
|
|
కలడందురు దీనుల యెడ, కలడందురు పరమయోగి గణములు పాలం
కలడందురన్ని దిశలను, కలడు కలండనెడువాడు కలడో లేడో !
Kaladamdhuru dheenula yeda
kaladaMdhuru dheenula yeda, kaladaMdhuru paramayOgi gaNamulu paalaM
kaladaMdhuranni dhishalanu, kaladu kalaMdaneduvaadu kaladO lEdO !
|
|
లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; ప్రాణంబులున్
ఠావుల్ తప్పెను; మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్,
నీవే తప్ప ఇతఃపరంబెరుగ మన్నింపం తగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా !
Laavokkinthayu ledu
laavokkiMthayu lEdhu; Dhairyamu vilOlaMbayye; praaNaMbulun
Taavul thappenu; moorCha vachche thanuvun dassen shramaMbayyedin,
neevE thappa ithaHparaMberuga manniMpaM thagun dheenunin
raavE yeeshvara! kaavavE varadha; saMraKShiMpu bhadhraathmakaa !
|
|
సిరికింజెప్పడు; శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు
ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత
శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై.
Sirikinjeppadu
sirikiMjeppadu; shaMkhachakra yugamuM chEdhOyi saMDhiMpadu
E parivaaraMbunu jeeradu aBhragapathiM panniMpadu
aa karNikaaMthara Dhammillamu chakkanoththadu vivaadhaprOthThitha
shree kuchOpari chElaaMchalamaina veedadu gajapraaNaavanOthsaahiyai.
|
|
అడిగెదనని కడువడి జను, అడిగిన దనుమగుడనుడుగడని నడ యుడుగున్
వెడవెడ చిడుముడి తడబడ, నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
Adigedanani
adigedhanani kaduvadi janu, adigina dhanumagudanudugadani nada yudugun
vedaveda chidumudi thadabada, nadu gidu; nadugidadhu jadima nadugidu
nedalan
|
|