|
|
|
Please click on the link below to play all the padyams
|
నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాశుగంబులన్
విల్లును దాల్చువాడు గడు విప్పగు వక్షమువాడు మేలుపై
జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులం
జల్లెడువాడునైన రఘుసత్తముడీవుత మా కభీష్టముల్
nallanivaaDu
nallanivaaDu padmanayanambulavaaDu mahaaSugambulan
villunu daalchuvaaDu gaDu vippagu vakshamuvaaDu mElupai
jalleDuvaaDu nikkina BhujambulavaaDu yaSambu dikkulam
jalleDuvaaDunaina raghusattamuDeevuta maa kaBheeShTamul
|
|
భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్, సీతన్ ముఖకాంతివిజిత సితఖద్యోతన్
BhootalanaathuDu
BhootalanaathuDu raamuDu preetumDai pemDli yaaDe bRthuguNamaNi sam
ghaatan BhaagyOpEtan seetan mukhakaamtivijita sitakhadyOtan
|
|
అలవాటు కలిమి మారుతి, లలితామిత లాఘవమున లంఘించెను శై
వలినీగణసంబంధిన్, జలపూరిత ధరణి గగన సంధిన్ గంధిన్
alavaaTu kalimi maaruti
alavaaTu kalimi maaruti, lalitaamita laaghavamuna lamghimchenu Sai
valineegaNasaMbaMdhin, jalapoorita dharaNi gagana samdhin gamdhin
|
|
తండ్రిక్రియ రామచంద్రుడు, దండ్రుల మరపించి ప్రజల దా రక్షింపన్
తండ్రుల నందరు మరచిరి, తండ్రిగదా రామచంద్రధరణిపుడనుచున్
tanDrikriya raamachamdruDu
tanDrikriya raamachamdruDu, damDrula marapimchi prajala daa rakshimpan
tamDrula namdaru marachiri, tanDrigadaa raamachamdradharaNipuDanuchun
|
|
|
|