హరి హరి ! సిరి యురమునగల, హరి
హరిహయుకొఱకు దనుజునడుగంజనియం;
బరహితరతి మతియుతులగు, దొరలకు
నడుగుటయు నొడలి తొడవగు బుడమిన్
Hari Hari
hari hari ! siri yuramunagala, hari
harihayukoRaku dhanujunadugaMjaniyaM;
barahitharathi mathiyuthulagu, dhoralaku
nadugutayu nodali thodavagu budamin
|
|
స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు,
హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు,
నుదారపదవ్యవహర్తకున్,
మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు,
నిర్జరీగళన్యస్తసువర్ణ సూత్ర పరిహర్తకు,
దానవలోక భర్తకున్.
Svasthi
svasthi jagathrayee bhuvana shaasana karthaku,
haasamaathra viDhvastha niliMpabharthaku,
nudhaarapadhavyavaharthakun,
muneeMdhrasthutha maMgaLaaDhvara viDhaana viharthaku,
nirjareegaLanyasthasuvarNa soothra pariharthaku,
dhaanavaloaka bharthakun.
|
|
ఇది నాకు నెలవని యేరీతి బలుకుదు? నొకచో టనక యెందు నుండ నేర్తు;
నెవ్వనివాడ నం చేమని పలుకుదు? నాయంతవాడనై నడవనేర్తు;
నీ నడవడి యని యెట్లు వక్కాణింతు బూని ముప్పొకల బోవ నేర్తు
నదినేర్తు నిదినేర్తు నని యేల చెప్పంగ? నేరువు లన్నియు నేన నేర్తు
నొరులు గారు నాకు నొరులకు నే నౌదు, నొంటివాడ జుట్ట మొకడు లేడు
సిరియు దొల్లి గలదు చెప్పెద నా టెంకి, సుజనులందు దఱచు సొచ్చియుందు
Idhi naaku nelavani
idhi naaku nelavani yaereethi balukudhu? nokacho tanaka yeMdhu nuMda naerthu;
nevvanivaada nM chaemani palukudhu? naayaMthavaadanai nadavanaerthu;
nee nadavadi yani yetlu vakkaaNiMthu booni muppokala boava naerthu
nadinaerthu nidhinaerthu nani yaela cheppaMga? naeruvu lanniyu naena naerthu
norulu gaaru naaku norulaku nae naudhu, noMtivaada jutta mokadu laedu
siriyu dholli galadhu cheppedha naa teMki, sujanulaMdhu dhaRachu sochchiyuMdhu
|
|
వారిజాక్షులందు వైవాహికము లందు, బ్రాణవిత్తమానభంగమందు
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు, బొంకవచ్చు నఘము వొంద డధిప!
Vaarijaakshulamdhu
vaarijaakShulaMdhu vaivaahikamu laMdhu, braaNaviththamaanabhaMgamaMdhu
jakitha goakulaagra janmarakShaNa maMdhu, boMkavachchu naghamu voMdha daDhipa!
|
|
కారే రాజులు ? రాజ్యముల్ కలుగవే ? గర్వోన్నతిం బొందరే ?
వారేరి సిరి మూటగట్టుకుని పోవం జాలిరే ? భూమి పై
బేరైనం గలదే ? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు ? వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా !
Kaare Raajulu
kaarE raajulu ? raajyamul kalugave ? garvonnathiM bondarE ?
vaarEri siri mootagattukuni pOvaM jaalirE ? bhoomi pai
bErainaM galadhe ? shibipramukhuluM breethin yashah kaamulai
yeerE kOrkulu ? vaaralan marachirE ikkaalamuN bhaargava !
|
|
నిరయంబైన నిబద్దమైన ధరణీ నిర్మూలనంబైన
దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో
హరుడైనన్ హరియైన నీరజభవుండభ్యాగతుండైననౌ
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా! ధీవర్య; వేయేటికిన్
NirayaMbaina
nirayaMbaina nibadhdhamaina DharaNI nirmoolanaMbaina
dhurmaraNaMbaina gulaaMthamaina nijamun raanimmu kaanimmu pO
harudainan hariyaina neerajabhavuMdaBhyaagathuMdainanau
dhirugan nEradhu naadhu jihva vinumaa Dheevarya vEyEtikin
|
|
ఇంతింతై, వటుడింతై, మరియు
తానింతై,
నభోవీధి పైనంతై, తోయదమండలాగ్రమున కల్లంతై,
ప్రభారాశిపైనంతై, చంద్రునికంతయై,
ధ్రువునిపైనంతై, మహర్వాటిపైనంతై,
సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై
iMthiMthai
iMthiMthai vatudiMthai mariyu thaaniMthai
nabhOveeDhi painaMthai thOyadhamaMdalaagramuna kallaMthai
prabhaaraashipainaMthai chaMdhrunikaMthayai
DhruvunipainaMthai maharvaatipainaMthai
sathyapadhOnnathuMdaguchu brahmaaMdaaMthasaMvarThiyai
|
|
రవిబింబం బుపమింప బాత్రమగు
ఛత్రంబై, శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.
ravibiMbaM
ravibiMbaM bupamiMpa baathramagu ChathraMbai, shiroarathnamai
shravaNaalaMktRthiyai gaLaabharaNamai sauvarNakaeyooramai
ChavimathkaMkaNamai katisThali nudhaMcha dhghaMtayai noopura
pravaraMbai padhapeeTamai vatudu dhaa brahmaaMdamun niMduchoan.
|
|