SongsList > Dasaradhi Karunapayonidhi by Shilpa Uppuluri
Download : Dasaradhi
Lyrics: Dasaradhi Karunapayonidhi
దాశరధీ ! కరుణాపయోనిధి ..
నువ్వే దిక్కని నమ్మడమా ? నీ ఆలయమును నిర్మించడమా ? నిరతము నిను భజియించడమా ? రామకోటి రచియించడమా ?
సీతారామస్వామి నే చేసిన నేరమదేమి నీ దయ చూపవదేమీ నీ దర్శనమియ్యవిదేమి
గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు ...
నీ రాజ్యము రాసిమ్మంటినా .. నీ దర్శనమే ఇమ్మంటిని కాని ...
ఏల రావు? నన్నేల రావు ..నన్నేల ఏల రావు?
తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా
డాండడడాండ డాండ నినదంబుల జాండమునిండ మత్తవేదండము నెక్కినేపొగడు నీ అభయవ్రతమేదిరా ...
ప్రేమరసాంతరంగ హృదయంగమ శుంగశుభంగరంగబహురంగద
భంగతుంగ సుగుణైకతరంగ సుసంగ సత్య సారంగ సుశృతి విహంగ పాప పృధుసంగవిభంగా ..
భూతలపతంగ మృదుమంగళ రూపము చూపవేమిరా .. గరుడ గమన రారా
|