SongsList > Mukunda Mukunda by Deepika Uppuluri
Download : Mukunda Mukunda
Lyrics: Mukunda Mukunda
ముకుంద ముకుంద కృష్ణా ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా
వెన్నదొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమ లయల మృదంగానివా
జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే
నీలాల నింగి క్రింద తేలియాడు భూమి తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగవిప్పి మడుగున లేచే సర్పశేషమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమణిచాడు నీ ధ్యానం చేయు వేళ విఙ్ఞానమేగా అఙ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమేగా అట అర్జునుడొందెను నీ దయవల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణంపోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే రేపల్లె రాగం తానం రాజీవమే
మత్స్యమల్లె నీటిన తేలి వేదములను కాచి కూర్మరూపధారివి నీవై భువిని మోసినావే వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు రావణుని తలలను కూల్చీ రాముడివై నిలిచావు కృష్ణుడల్లె వేణువూదీ ప్రేమను పంచావు ఇక నీ అవతారాలెన్నెనున్నా ఆధారం నేనే నీ ఒరవడిపట్టా ముడిపడిఉంటా ఏదేమైనా నేనే మదిలోని ప్రేమ నీదే మాధవుడా మందారపూవే నేను మనువాడరా |